వడ్డీ రేటును తగ్గించిన పోస్ట్ ఆఫీసు

వడ్డీ రేటును తగ్గించిన పోస్ట్ ఆఫీసు

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)తన పొదుపు ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాపై చెల్లించే వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు నిన్నటి(మంగళవారం) నుంచే నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండియా పోస్ట్‌లో భాగమైన IPPBకేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. IPPB వెబ్‌సైట్‌ ప్రకారం రూ. లక్ష వరకు ఉన్న డిపాజిట్లపై 2.25% వడ్డీ రేటు లభిస్తుంది. ఇది వరకు ఇది 2.50 శాతంగా ఉండేది. ఇక లక్ష రూపాయలు నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీని 2.75 శాతం నుంచి 2.50% శాతానికి తగ్గించింది. రోజు వారి బ్యాలన్స్ మీద కొత్త వడ్డీ రేటు లెక్కిస్తారు. రోజువారీ ఈఓడి బ్యాలెన్స్ మీద లెక్కించిన వడ్డీని మూడు నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయనుంది.

మరిన్ని వార్తల కోసం...

టీచర్ పోస్టులను భర్తీ చేయండి