ఇజ్రాయెల్‎పై దాడులు ఆపేస్తున్నం.. ఇరాన్ బిగ్ అనౌన్స్‎మెంట్

ఇజ్రాయెల్‎పై దాడులు ఆపేస్తున్నం.. ఇరాన్ బిగ్ అనౌన్స్‎మెంట్

టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు ప్రతీదాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ మండిపోతుంది. ఈ తరుణంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‎పై దాడులు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, తమ మిత్రపక్షమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే మాత్రం తీవ్రమైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లిన పశ్చిమాసియాలో ఇరాన్ లేటేస్ట్  ప్రకటనతో శాంతి వాతావరణం ఏర్పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ వార్‎కు బ్రేక్ పడటంతో ప్రపంచదేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. 

అసలేం జరిగిందంటే..!

గత కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మళ్లీ భగ్గుమంటోంది. లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని రామత్ డేవిడ్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్   ప్రకటించింది. 

►ALSO READ | తక్షణమే కాల్పులు ఆపండి: ఇరాన్, ఇజ్రాయెల్‎ దేశాలకు ట్రంప్ పిలుపు

ఇరాన్ మిస్సైళ్లను గాల్లోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ దాడులకు కౌంటర్‎గా నైరుతి ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపింది. ఇరు దేశాల పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ మండిపోతుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ చేరుకుంటుండటంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రంగంలోకి దిగారు. 

తక్షణమే కాల్పులు ఆపండి: ట్రంప్

ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో విరుచుకుపడుతుండటంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలకు కీలక పిలుపునిచ్చారు. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరు దేశాలకు సూచించారు. ట్రంప్ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‎పై సైనిక చర్య నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం గమనార్హం