వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ దాడులతో పశ్చిమాసియా మళ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలకు కీలక పిలుపునిచ్చారు. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరు దేశాలకు సూచించాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టాడు.
గత కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మళ్లీ భగ్గుమంటోంది.
లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని రామత్ డేవిడ్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే, ఇరాన్ మిస్సైళ్లను గాల్లోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.
►ALSO READ | ఫిలిప్పీన్స్ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి.. క్షణాల్లోనే అల్లకల్లోలం
ఇరాన్ దాడులకు కౌంటర్‌గా నైరుతి ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపింది. ఇరు దేశాల పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ మండిపోతుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ చేరుకుంటుండటంతో ట్రంప్ రంగంలోకి దిగారు. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరాన్, ఇజ్రాయెల్‌కు సూచించాడు. ట్రంప్ పిలుపు మేరకు ఇరు దేశాలు కాల్పులు ఆపుతాయో లేదో చూడాలి మరీ.
