ఇరాన్‌ దేశ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

ఇరాన్‌ దేశ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై తన ప్రభావం చూపిస్తోంది. అన్ని వర్గాలను భయపెడుతున్న ఈ వైరస్ బారిన పడ్డారు ఇరాన్ దేశ ఉపాధ్యక్షురాలు మస్సౌమీ ఎబ్టెకర్. ప్రస్తుతం ఆమెను సొంత నివాసంలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ హెడ్ మొజ్తబాకు కూడా కరోనా వైరస్ సోకింది. దీనిపై స్పందించిన ఆయన… తనకు తాను నిర్బంధం విధించుకున్నానని ఓ వీడియో ద్వారా తెలిపారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.