IRCTC స్కాం: లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు

IRCTC స్కాం:  లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు

ఢిల్లీ: ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 13న తుది తీర్పు ఇవ్వనున్నట్టు కోర్టు తెలిపింది. ఆ రోజు లాలూ కుటుంబంతోపాటు ఇతర నిందితులు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ స్పష్టం చేసింది.

 2004 నుంచి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఇండియన్ రైల్వేస్కి చెందిన భువనేశ్వర్, రాంచీలోని బీఎస్ఆర్ హోటళ్ల నిర్వహణ బాధ్యతను ఐఆర్సీటీసీకి బదిలీ చేశారు. తరువాత వీటిని టెండర్ల ద్వారా పాట్నాకు చెందిన 'సుజాతా హోట ల్స్ 'కు లీజుకు ఇచ్చారు. ఈ ప్రక్రియలో నిబంధనల్ని తమ అనుకూలంగా మార్చారని, టెండర్లను ప్రైవేటు కంపెనీలకు తప్పుదారిలో కట్టబెట్టారని సీబీఐ అభియోగం మోపింది. లాలూకి అనుకూలంగా వ్యవహరించేందుకు అప్పటి ఐఆర్సీటీసీ అధికారులు. సుజాతా హోటల్స్ డైరెక్టర్లు విజయ్, వినయ్ కొచార్లు సహకరించారని ఆరోపణలున్నాయి. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ( ప్రస్తుతం లారా. ప్రాజెక్ట్స్) సుజాతా హోటల్స్ సంస్థలపైనా కేసు నమోదు అయింది. 

►ALSO READ | 71 మంది మావోలు సరెండర్.. 30 మందిపై రూ.64 లక్షల రివార్డు

ఇదిలా ఉంటే, తమపై సీబీఐకి సరిపడిన సాక్ష్యాలు లేవని లాలూ, రాబ్రీ, తేజస్వి లాయర్లు వాదిస్తున్నారు. కానీ కోర్టు మొదటిగా అభియోగాల విషయాన్ని తేల్చేందుకు అక్టోబర్ 13న తీర్పు చెప్పనున్న నేపథ్యంలో ఈ కేసు రాజకీయ ఉత్కంఠ రేపుతోంది.