క్రికెట్కు ఐర్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ గుడ్ బై

క్రికెట్కు ఐర్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ గుడ్ బై

ఐర్లాండ్ స్టార్ హిట్టర్  కెవిన్ ఓబ్రెయన్ తన ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ కావాలని భావించినా..ప్రస్తుత సిరీస్ లకు సెలెక్టర్లు తనను పక్కన పెట్టడం బాధించిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెవిన్ వివరించాడు.

బ్యాటింగ్, బౌలింగ్తో ఎన్నో విజయాలు..
38 ఏళ్ల కెవిన్ 2006 జూన్లో ఐర్లాండ్ తరపున క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 153 వన్డేలు, 110 టీ20 మ్యాచులు ఆడాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో మూడు సెంచరీలు కొట్టాడు. 24హాఫ్ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ జట్టుకు విజయాలు అందించాడు. సుదీర్ఘ కెరీర్‌లో 172 వికెట్లు పడగొట్టాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో స్టిర్లింగ్, పోర్టర్‌ఫీల్డ్ తర్వాత ఐర్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఓబ్రెయన్ నిలిచాడు.

2011 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కు షాక్..
ఓబ్రెయన్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2007 వరల్డ్ కప్లో పాక్ను ఓడగొట్టాడు. విండీస్లో జరిగిన 2007 వరల్డ్ కప్లో ..ఐర్లాండ్ సంచలన ఆటతీరుతో రెండో రౌండ్కు చేరుకుంది. పాక్ తో జరిగిన మ్యాచ్లో ఓబ్రెయిన్ ఒక వికెట్ తీయడంతో పాటు..జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక భారత్లో జరిగిన 2011లో ఓబ్రెయన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. బెంగుళూరులో ఇంగ్లాండ్‌పై  63బంతుల్లోనే 113పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ విధించిన 328పరుగుల టార్గెట్ను ఐర్లాండ్ సునాయాసంగా ఛేదించింది. ఇది ఐర్లాండ్కు చరిత్రాత్మక విజయం.