T20 World Cup 2024: పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పఠాన్

T20 World Cup 2024: పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పఠాన్

ఐపీఎల్ టోర్నీ ముగిసిన ఐదు రోజులకే (జూన్ 1 నుంచి) టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. గతేడాది వన్డే ప్రపంచ కప్ ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా.. ఈ సారి టైటిల్  గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో పొట్టి ప్రపంచ కప్ కు ఎవరిని ఎంపిక చేయాలనేది బీసీసీఐ సెలెక్టర్ల ముందున్న అతి పెద్ద సవాల్. సీనియర్లకు చోటివ్వాలా..! లేదా యువ జట్టును పంపాలా..! అని తర్జన భర్జన పడుతున్నారు. 

ఒకవైపు, ఈ తర్జన భర్జనలు సాగుతుండగానే, మరోవైపు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఏకంగా జట్టును ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మొత్తం 15 మందితో కూడిన ప్రాబబుల్స్ ను పఠాన్ ప్రకటించాడు. రిషబ్ పంత్ ను వికెట్ కీపర్ గా సెలక్ట్ చేయగా.. శివమ్ దూబేకు జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ హార్దిక పాండ్యను ఎంపిక చేసినా.. అతనిపై కొన్ని పరిమితులు విధించాడు. రెగ్యులర్ గా అతడు బౌలింగ్ చేయగలిగితేనే ఎంపిక చేయాలనీ లేకపోతే అతని స్థానంలో మరొకరిని సెలక్ట్ చేయాలని పఠాన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో పాటు.. ఒక వికెట్ కీపర్, ఒక బ్యాటర్ ను ఉండాలన్నాడు.      

జూన్ 1 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 29న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

T20 ప్రపంచ కప్ 2024 కోసం ఇర్ఫాన్ పఠాన్ యొక్క భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా (అతను క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తేనే), రింకు సింగ్, రవీంద్ర జడేజా , కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా , అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్/యుజీ చాహల్, శుభమాన్ గిల్ / సంజు శాంసన్