
రామడుగు, వెలుగు: ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంపుహౌస్ ద్వారా శనివారం వరకు రెండు టీఎంసీల నీటిని మిడ్ మానేర్‌కు ఎత్తిపోసినట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీరు నంది మేడారానికి వస్తుండగా, అంతే నీరు 4 పంపుల ద్వారా ఎత్తి పోస్తుండగా గాయత్రి పంపుహౌస్‌కు చేరుతున్నాయి. ఆ నీటిని బాహుబలి మోటార్ల ద్వారా వరద కాల్వకు, అక్కడ్నుంచి షానగర్ శివారులోని జంక్షన్ పాయింట్‌నుంచి మిడ్ మానేరుకు తరలిస్తున్నారు.
గాయత్రి పంపుహౌస్ నుంచి శనివారం 1,2,4,5,6 బాహుబలి మోటార్ల ద్వారా సుమారు 1.3 టీఎంసీల నీటిని మిడ్‌మానేర్‌కు తరలించినట్లు డీఈ రాంప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం 4వ నంబర్బాహుబలి మోటార్‌ను ఆపేసి 1, 2, 5, 6 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు వివరించారు.