పార్ట్ టైమ్ లెక్చరర్ల నియామకాల్లో అక్రమాలు

పార్ట్ టైమ్ లెక్చరర్ల నియామకాల్లో అక్రమాలు
  • ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఎదుట స్టూడెంట్ల ఆందోళన

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో పార్ట్ టైమ్ లెక్చరర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కాలేజీ ఎదుట స్టూడెంట్లు బుధవారం నిరసనకు దిగారు. కాలేజీ ప్రిన్సిపాల్, ఓఎస్డీ అవినీతికి పాల్పడ్డారని.. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని స్టూడెంట్లు ఆరోపించారు.

ప్రిన్సిపాల్, ఓఎస్డీని వెంటనే సస్పెండ్ చేయాలని లేకపోతే వీసీ చాంబర్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ నాయక్, క్రీడా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ గౌడ్, ఎస్ఎస్ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు గౌడ్, అధికార ప్రతినిధి వెంకటేశ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.