ఇప్పటి వరకూ ఉద్యోగులను మాత్రమే భయపెట్టిన ఏఐ విప్లవం దానిని నిర్మిస్తున్న కంపెనీలకు, ప్రభుత్వాలకు కూడా కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది. రోబో సినిమాలో చూపించినట్లుగా మనిషి మనుగడకే ముప్పు తెచ్చే స్థాయికి ఏఐ తనను తాను సొంతంగా అభివృద్ధి చేసుకుంటూ పోతుండటం ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తోంది. అయితే భవిష్యత్తులో మనుషులనే దాటేసి పెత్తనం చేసే స్థాయికి ఏఐ చేరుకుంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్న వేళ దానిని అదుపు చేయటం కూడా అవసరం అంటున్నారు నిపుణులు. లేదంటే ఇది కూడా గతంలో ఒక అద్భుత ఆవిష్కరణ జ్ఞాపకంగా రానున్న తరాలకు మిగిలిపోవచ్చు.
ఏఐ 'రికర్సివ్ సెల్ఫ్ంప్రూవ్ మెంట్'ను ఆపడం కోసం అడ్వాన్స్డ్ ఏఐ అభివృద్ధికి తాత్కాలిక బ్రేక్ ఇవ్వాలన్న ఆంత్రోపిక్ వాదనలపై ఏఐ నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నా యి. భవిష్యత్తు ఏఐ వ్యవస్థలను నడిపించే కోడ్ ను ఏఐ ఎక్కువగా రాస్తున్నందున.. సామర్థ్యాన్ని నిర్మించడం నుంచి దానిని గవర్నింగ్ వైపు ఏఐ పనితీరు మారుతుందని ఫ్యూచర్ షిఫ్ట్ లాబ్స్ కోఫౌండర్ సాగర్ విష్ణోయ్ చెప్పారు. "ఏఐ స్వీయమెరుగుదల ఆవిష్కరణలను గణనీయంగా వేగవంతం చేయగలదు. కానీ ఇది పర్యవేక్షణ, భద్రత, జవాబుదారీతనం వంటి ముఖ్యమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది.
మరింత సమర్థంగా మారుతున్న ఈ ఏఐ వ్యవస్థలు మానవ ప్రాధాన్య తలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడమే అసలైన పరీక్ష" అని సాగర్ విష్ణోయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది బహుశా అన్నింటికంటే కష్టమైన పని కావచ్చునని ఏఐఇన్స్యూర్డ్ సీటీఓ డాక్టర్ శ్రీనివాస్ పద్మనాభుని చెప్పారు. "సిద్ధాంతపరంగా బాగానే అనిపిస్తుంది. కానీ ఆచరణలో కష్టం. తాత్కాలి కంగా నిలిపివేయడానికి ఫౌండేషనల్ మోడల్స్ నిర్మించే వారందరినీ ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే వెనుకబడి పోతామనే ఒత్తిడిని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు"
అని ఆయన అన్నారు.
మరోవైపు ఏఐ తనకుతా నుగా నిర్మించుకుని, కంట్రోల్ తప్పిపోయేంత భయంకరమైన పరిస్థితి వచ్చే అవకాశాలు లేవని కూడా పలువురు ఏఐ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. షార్టహిల్స్ ఏఐ కోఫౌండర్, ప్రెసిడెంట్ పవన్ ప్రభాత్ మాట్లాడుతూ.. "ఇది ద మ్యాట్రిక్స్ లేదా టె ర్మినేటర్ వంటి పరిస్థితికి దారితీస్తుందని నేనుభయ పడటంలేదు. ఎందుకంటే ఏఐ తన ఉనికికి ముప్పు తెచ్చిపెడితే మానవులు ఎప్పుడైనా ప్లగ్ను పీకేయ గలరు" అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఏఐ 'రికర్సివ్ సెల్ఫ్ంప్రూవ్ మెంట్ 'కు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడం ఎలా? అన్నదాని పై పూర్తి స్థాయి అధ్యయనం చేసేందుకు ఆంత్రోపిక్ ఇన్స్టిట్యూట్ సిద్ధమవుతున్నట్టు చెప్తున్నారు.
