Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?

Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?

మెహబూబా(Mehabooba) సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ నేహా శెట్టి(Neha shetty). కానీ, ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆలా కొంతకాలం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి.. డీజే టిల్లు(DJ Tillu) రూపంలో బంపర్ ఆఫర్ దక్కింది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన ఈ సినిమాలో రాధిక గా కనిపించి తన అద్భుతమైన, అమాయకమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ ఓపక్క పాత్రతో యూత్ లో ఆమెకు యమ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ తరువాత వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నేహా.. ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అవును.. మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అలరించారు నేహా శెట్టి. ఆమె పాత్ర సినిమాలో కనిపించగానే హాల్ మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అంతలా డీజే టిల్లు సినిమాలో తన పాత్రతో ఆకట్టుకున్నారు నేహా శెట్టి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే..  టిల్లు స్క్వేర్ సినిమాలో రాధిక పేరుతోనే మళ్ళీ స్క్రీన్ పై కనిపించిన ఆమె పేరు.. టైటిల్స్ లో మాత్రం నేహా శెట్టి కాకుండా.. నేహా హరిరాజ్ శెట్టి అని కనిపించింది. దీంతో ఈ అమ్మడు సక్సెస్ కోసం పేరు మార్చుకుంది అనే వార్తలు వైరల్ అయ్యాయి. 

అంతేకాదు.. నేహా శెట్టి మధ్యలో వచ్చిన ఈ హరిరాజ్ ఎవరు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్. ఇంతకీ ఆ హరిరాజ్ ఎవరంటే నేహా శెట్టి తండ్రట. అయితే సక్సెస్ కోసం ఆమె తన తండ్రి పేరును తన పేరులో యాడ్ చేసుకుందా లేక.. చిత్ర యూనిట్ కావాలనే ఆలా వేశారా అనేది తెలియాల్సి ఉంది. ఎలా అయితేనే.. తాను హీరోయిన్ గా నటించని  టిల్లు స్క్వేర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆడియన్స్ తన గురించి మాట్లాడుకునేలా చేసింది నేహా శెట్టి.