సొంత సోషల్ మీడియా సైట్ పై మస్క్ కన్ను?

సొంత సోషల్ మీడియా సైట్ పై మస్క్ కన్ను?

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన న్యూస్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. చిత్ర, విచిత్రమైన ట్వీట్లు చేస్తూ.. కాస్త సెటైరికల్ గా కామెంట్స్ చేసే మస్క్.. ఈ సారి చెప్పకనే ఓ వార్తను చేరవేశారు.  మొన్నటివరకూ ట్విట్టర్ మీద పడ్డ మస్క్.. ఇప్పుడు సోషల్‌ మీడియాపై కన్నేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఓ వెబ్ సైట్ ను క్రియేట్ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. ఇటీవలే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ట్విట్టర్ డీల్ పై ముందుకెళ్లకపోతే... సోషల్ మీడియా వెబ్ సైట్ ను సృష్టిస్తారా అన్న ఓ యూజర్ ప్రశ్నకు మస్క్ సమాధానమిచ్చారు. దీనికి ఆయన ఎక్స్.కామ్ అనే పదంతో రిప్లై ఇచ్చారు. అంతకు మించి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో ఆ పేరుతోనే ఆయన సోషల్ మీడియా సైట్ ఓపెన్ చేస్తారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

అయితే ఎక్స్. డామ్ అనే డొమైన్ ను మస్క్ 1999లోనే స్థాపించారు. 2017లో మళ్లీ వారి నుంచి దక్కించుకున్నారు. కొన్నాళ్లకు సైట్‌ను పునరుద్ధరించానని చెప్పారు. అయితే ఈ ఎక్స్.డామ్ (X.com ) ఏంటా అని ఇప్పుడు ఓపెన్‌ చేస్తే కేవలం 'X' అని మాత్రమే కనిపిస్తోంది. దీని గురించి మస్క్‌ కూడా ఎలాంటి వివరాలూ చెప్పకోవడంతో... ఈ మస్క్ నెక్స్ట్ చేసే పని ఏంటా అని పలువురు కిందామీదా పడిపోతున్నారు.