జెన్-జెడ్ vs మిలీనియల్స్: హెల్త్ కేర్ విషయంలో ఎవరు పర్ఫెక్ట్ !

జెన్-జెడ్ vs మిలీనియల్స్: హెల్త్ కేర్ విషయంలో ఎవరు పర్ఫెక్ట్ !

ప్రపంచం చాలా స్పీడ్ అయిపోయింది. జాబ్స్, వర్క్స్, బిజినెస్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడూ ఎదో ఒక బిజీ షెడ్యూల్. ఏ పని లేకుంటే సోషల్ మీడియాలో టైమ్ పాస్. కనీసం తినటానికి కూడా టైమ్ సరిపోని పరిస్థితి.  ఇలాంటి కండిషన్ లో హెల్త్ మేనేజ్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. అయితే హెల్త్ కాన్షియస్నెస్ విషయంలో 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన  మిలీనియల్స్ కంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన జనరేషన్ జెడ్ వాళ్లే కేరింగ్ గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

ప్రోటీన్ కౌంట్, స్లీప్ స్కోర్స్ ట్రాకింగ్, ఏ ప్రాబ్లం ఉన్న డాక్టర్స్ కు ధైర్యంగా చెప్పడం, వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం.. ఫిట్ నెస్ పై అవగాహన కలిగి ఉండటం జెన్ జెడ్ ఫాలో అవుతున్నట్లు ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు . అదే సమయంలో మిలీనియల్స్ అధిక పనిభారంతో.. ఆఫీసుల్లో నడుము నొప్పితో బాధపడుతూ.. టీ కాఫీలతో ఉపశమనం పొందటం జరుగుతోందని చెబుతున్నారు. ఇప్పుడు జనె-జెడ్ పాటిస్తున్న జాగ్రత్తలు అదే వయసులో ఉన్నపుడు మిలీనియల్స్ కు చాలా మంది కనీసం అవగాహన కూడా లేని విషయంగా చెబుతున్నారు. 

  • అవేర్నెస్ మాత్రమే.. పాటించడంలో చాలా తేడా

అయితే ఈ వాదనను కొందరు కొట్టిపారేస్తున్నారు. జెన్-జెడ్ కు అవేర్ నెస్ ఎక్కువగా ఉండటం వాస్తవమే. అయినప్పటికీ పాటించే విషయంలో మిలీనియల్స్ బెటర్ అంటున్నారు చెన్నై కావేరీ హాస్పిటల్ కు చెందిన ప్రొ.పి మనోకర్. ఫిజికల్ హెల్త్ విషయంలో మిలీనియల్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. జెన్-జెడ్ ను కేవలం అవేర్నెస్ జనరేషన్ అని మాత్రమే అనవచ్చునని అంటున్నారు. 

  • వెల్ నెస్ మూమెంట్ మిలీనియల్స్ తోనే..

జెన్-జెడ్  అవగాహన కలిగిన తరం అయినప్పటికీ.. వెల్ నెస్ మూమెంట్ మాత్రం మిలీనియల్స్ తోనే స్టార్ట్ అయినట్లు చెబుతున్నారు. యోగా, పరిశుభ్రమైన ఆహారం, జిమ్ మెంబర్షిప్, మెడిటేషన్ యాప్స్, హెల్త్-వర్క్ లైఫ్ ప్రణాలికలు మొదలైనవి మిలీనియల్స్ తోనే స్టార్ట్ అయినట్లు చెబుతున్నారు. 

అయితే జెన్-జెడ్ కు టెక్నాలజీ, భాష మొదలైనవి వారసత్వంగా పుట్టుకతోనో అందుబాటులో ఉండటంతో.. కాస్త ఓపెన్ గా ఉంటారని చెబుతున్నారు. ఫిట్ నెస్, నిద్ర, ఆరోగ్య నివారణ మార్గాల విషయంలో ఓపెన్ గా డాక్టర్లతో డైరెక్ట్ గా చెప్పుకునేలా ఉంటారని అంటున్నారు. హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నా.. ఇతర సమస్యలు వాళ్లకు చాలా ఉన్నాయంటున్నారు. 

  • ఫిజికల్ హెల్త్ విషయంలో ఎవరూ పర్ఫెక్ట్ గా లేరు:

శారీరక ఆరోగ్యం విషయంలో ఈ రెండు తరాల్లో ఏ ఒక్క తరం కూడా పర్ఫెక్టా లేదని చెబుతున్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్యన ఉన్న వాళ్లు కూడా హార్ట్ అటాక్స్ తో చనిపోతుండటమే ఇందుకు ఉదాహరణ. అదే విధంగా చిన్న వయసులో డయాబెటిస్, హైపర్ టెన్షన్ రావడం గమనించవచ్చు. దీనికి కారణం ఓవర్ స్ట్రెస్, లైఫ్ స్టైల్ కారణమని అంటున్నారు. 

  • మెంటల్ హెల్త్:

మెంటల్ హెల్త్ విషయంలో జెన్-జెడ్ ఆలోచన అడ్వాన్స్ గా ఉందని అంటున్నారు. వాళ్ల కంఫర్ట్ కోసం మొహమాటం లేకుండా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలను పరిష్కరించుకోవడంలో నిర్మొహమాటంగా డాక్టర్లకు, సైకాలజిస్టులకు చెప్తూ ఫ్రీ అయిపోతారు. ఇతరుల సహాయం తీసుకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడరు. అదే సమయంలో మిలీనియల్స్ ఎవరి సాయం తీసుకోవలన్నా.. సైకియాట్రిస్ట్ లకు చెప్పాలన్నా ఇబ్బంది పడతారని చెబుతున్నారు. స్ట్రెస్ ఫీల్ అవడంతో మిలీనియల్స్ ముందున్నట్లు చెబుతున్నారు. 

  • మొత్తానికి ఎవరు ఆరోగ్యవంతులు:

జెన్ Z,  మిలెనియల్స్ మధ్య ఆరోగ్యంలో స్పష్టమైన విన్నర్ అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు డాక్టర్లు. జెన్ Z ఆరోగ్య అవగాహన, మానసిక సమస్యల పట్ల ఓపెన్‌నెస్‌లో ముందంజలో ఉన్నా, డిజిటల్ లైఫ్ స్టైట్, తక్కువ వ్యాయామం, నిద్ర లేకపోవడం వంటి సవాళ్లు వారిని ముందస్తుగానే ఆరోగ్య సమస్యల వైపు నెట్టవచ్చు అని అంటున్నారు. మిలీనియల్స్ ప్రస్తుతం ఎక్కువ క్రానిక్ వ్యాధులతో ఉన్నా, అది వయసు కారణంగానే అంటున్నారు. నిజమైన ఆరోగ్యం అంటే  అవగాహన ఉండటమే కాదు.. లాంగ్ రన్ లో పాటించే అంశాలపై ఆధారపడిఉంటుంది. జెన్ Z భవిష్యత్తులో ఎలా ఉంటారనేది చూడాలి.