తన అందం, అభినయంతోనే కాదు ఫోటో షూట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. అయితే ఇటీవల ఈ నాగిని భామ వైవాహిక జీవితం గురించి నెట్టింట ఒక రేంజ్‌లో రూమర్స్ షికారు చేస్తున్నాయి. తన భర్త సూరజ్ నంబియార్‌తో ఆమె విడిపోతోందంటూ వస్తున్న వార్తలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. లేటెస్ట్ గా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ
అసలేం జరిగింది?
కొద్దిరోజులుగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ డివోర్స్ రూమర్స్ మొదలయ్యాయి. అంతటితో ఆగకుండా, సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే డిలీట్ చేయగా.. మౌనీ రాయ్ తన ప్రొఫైల్ నుండి భర్తతో ఉన్న రొమాంటిక్ ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. దీనికి తోడు మౌనీ తన స్నేహితురాలికి బర్త్‌డే విషెస్ చెప్తూ.. "రాప్చర్ లేదా రూయిన్" అంటూ పెట్టిన ఒక క్రేజీ క్యాప్షన్ నెటిజన్లకు మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. దీంతో వీరి నాలుగేళ్ల బంధం ముగిసిపోయిందంటూ కథనాలు ఊపందుకున్నాయి.
మౌనీ రాయ్ ఫైర్..!
ఈ రూమర్స్ కాస్తా ముదరడంతో మౌనీ రాయ్ చివరకు మౌనం వీడింది. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెడుతూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దయచేసి మీడియా సంస్థలన్నీ ఇలాంటి తప్పుడు ప్రచారాలను, లేనిపోని కథనాలను రాయడం ఆపండి. మాకు కొంచెం ప్రైవసీ, స్పేస్ ఇవ్వండి అంటూ చేతులు జోడించి రిక్వెస్ట్ చేసింది.
గోవాలో గ్రాండ్ వెడ్డింగ్..
దాదాపు మూడేళ్లపాటు సీక్రెట్ లవ్‌లో ఉన్న ఈ జంట.. 2022 జనవరి 27న గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. హల్దీ, సంగీత్ వేడుకలతో పాటు సౌత్ ఇండియన్ (మలయాళీ), నార్త్ ఇండియన్ (బెంగాలీ) సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. సూరజ్ నంబియార్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా రాణిస్తున్నారు.
బుల్లితెర టు బాలీవుడ్ స్టార్ గా..
మౌనీ రాయ్ కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. 'బ్రహ్మాస్త్ర', 'గోల్డ్' వంటి బిగ్గెస్ట్ బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. రీసెంట్‌గా 'టెంప్టేషన్ ఐలాండ్' షోకి హోస్ట్‌గా కూడా అలరించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ అండ్ లవ్లీ పోస్టులతో రచ్చ చేసే ఈ క్రేజీ కపుల్.. సడన్‌గా ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఫ్యాన్స్‌ను కాస్త కంగారు పెట్టినా, మౌనీ ఇచ్చిన క్లారిటీతో రూమర్లకు ప్రస్తుతానికైతే బ్రేక్ పడినట్లయింది.
