ఇట్లా చేయడం కరెక్టేనా ?.. ఈవీఎంలను సరిగా పెట్టలేదంటూ అంజన్ కుమార్ ఆగ్రహం

ఇట్లా చేయడం కరెక్టేనా ?.. ఈవీఎంలను సరిగా పెట్టలేదంటూ అంజన్ కుమార్ ఆగ్రహం

ముషీరాబాద్, వెలుగు:  రాంనగర్​లోని పోలింగ్ బూత్ 232లో ఓటు వేయడానికి కుటుంబంతో కలిసి వచ్చిన హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సమక్షంలోనే పోలింగ్ సిబ్బందిని ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఈవీఎంపైన చూపిస్తున్న బ్యాలెట్ మొదటి పేజీకి బదులు రెండో పేజీని పెట్టడంపై పోలింగ్ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా చేయడం కరెక్టేనా..? అని ప్రశ్నించారు.

అనంతరం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటర్లు, ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు బీఆర్ఎస్​కు  వత్తాసు పలుకుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మొదట స్టార్ట్ అయ్యేది ఒకటే నంబరు అలా పెట్టకుండా ఇతర దాన్ని తీసుకొచ్చి పెట్టడం సరికాదని సిబ్బందికి సూచించగా సరి చేస్తామని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.