సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. కాగా ఈరోజు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన వస్తోంది. అయితే ఈ దేవర ట్రైలర్ విడుదల టైం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
కాగా ఇప్పటివరకూ దేవర చిత్రానికి సంబందించిన ప్రతీ అప్డేట్ విడుదల టైం ని చూసినట్లయితే టోటల్ గా 9 సంఖ్య వస్తుంది. ఇందులో దేవర ట్రైలర్ విడుదల సమయం సా. 5.04 నిమిషాలు, చుట్టమల్లె పాట విడుదల సమయం సా. 5.04 నిమిషాలు, దావుది పాట విడుదల సమయం సా. 5.04 నిమిషాలు ఇదేకాక ఈ చిత్రంలో విలన్ గా నటించి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ కూడా సాయంత్రం 4.05 నిముషాల సమాయంలో విడుదల చేసారు. కాగా దేవర చిత్రంలోని పాటలు, ట్రైలర్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే అలరించి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెంచేసాయి.
అయితే దేవర అప్డేట్స్ కి సంబంధించిన సినిమా యూనిట్ ఫాలో అయిన టైమింగ్స్ ని చూస్తే టోటల్ గా 9 వస్తుంది. ఈ 9 సెంటిమెంట్ ఎన్టీఆర్ కి బాగా కలసి వస్తుందని అందుకే చిత్ర విడుదల తేదీని కూడా సెప్టెంబర్ 27 (2+7=9) రోజున చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ కి సంబంధించిన కార్లు కూడా ఎక్కువగా 9 డిజిట్ నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్నట్లు సమాచారం.