స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి..?

 స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి..?

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja hegde) పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఆ స్టార్ క్రికెటరేనా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసమే తాను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందని సమాచారం. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొంత కాలంగా ప్రముఖ క్రికెటర్ తో చాలా క్లోజ్ గా ఉంటుందట. అతను ముంబైకి చెందిన క్రికెటర్‌తో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఆ క్రికెటర్ పెట్టె ప్రతీ పోస్ట్ కి రిప్లై కూడా ఇస్తుందట ఈ బ్యూటీ. దీంతో వీరిద్దరి మధ్య ఎదో జరుగుతోందని బీటౌన్  లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ కు కలిసి రావడం కూడా ఈ రూమర్స్ కు ఆజ్యం పోసింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. పూజా హెగ్డే ఒక క్రికెటర్‌తో కలిసి తిరగడం ఇది ఫస్ట్ టైం ఏంకాదు. గతంలో ఆమె కర్ణాటకకు చెందిన క్రికెటర్‌ని వివాహం చేసుకోబోతోందని న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంపై పూజా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇక పూజా హెగ్డే చేస్తున్న సినిమాల విషయానికీ వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో హౌస్ ఫుల్4 లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.