కేజీఎఫ్ ముగింపు, సలార్ ఆరంభం.. ఒకే సమయంలో

కేజీఎఫ్ ముగింపు, సలార్ ఆరంభం.. ఒకే సమయంలో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) కాంబోలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్(Salaar). చాలా కాలం నుండి ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అంచనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ సినిమాపై. అందుకే ఈ సినిమా నుండి వచ్చిన చిన్న అప్డేట్ అయినా.. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

సలార్తో కేజీఎఫ్ లింక్ 

తాజగా సలార్ సినిమా నుండి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్ జులై 6న ఉదయం 5:12 నిమిషాలు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సలార్ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సలార్ సినిమాను కేజీఎఫ్(KGF) సినిమాతో లింకప్ చేస్తూ.. న్యూస్ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.

సలార్, రాఖీభాయ్ స్నేహితులా? 

ఇంతకీ ఆ లింక్ ఏంటంటే.. కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్ చనిపోయే టైమ్, ఇప్పుడు సలార్ టీజర్ రిలీజ్ టైమ్ ఒకటి కావడం. రాకీ భాయ్ తన దగ్గర ఉన్న బంగారంతో షిప్ లో సముద్రంలోకి వెళతాడు.. తుఫాన్ లో చిక్కుకుని షిప్ మునిగి రాకీ భాయ్ చనిపోయాడు. షిప్ మునిగే విజువల్స్ లో.. అందులోని గోడ గడియాంలో సమయంలో ఉదయం 5 గంటల 12 నిమిషాలు చూపిస్తుంది. 

ఇప్పుడు దీన్నే నెటిజన్లు పట్టుకున్నారు. కేజీఎఫ్ 2లోని ఎండింగ్ సీన్ టైం.. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ రిలీజ్ టైం ఒకటే అంటూ.. ఫొటోలతో సహా వైరల్ చేస్తున్నారు అభిమానులు.

 దీంతో.. సలార్ మూవీ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తోందని, ఖచ్చితంగా.. కేజీఎఫ్ కు లింక్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. రాకీభాయ్, సలార్ ఫ్రెండ్స్ అని, రాకీభాయ్ కి ఇచ్చిన మాట ప్రకారమే అండర్ వరల్డ్ ను అంతం చేసేందుకే సలార్ రంగంలోకి దిగుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అయితే ఈ న్యూస్ వల్ల సలార్ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ వార్త గనక నిజమైతే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.