Sukumar, Vijay: విజయ్, సుకుమార్ కాంబో లేనట్టేనా.. లైనప్ చూస్తే అలానే ఉంది!

Sukumar, Vijay: విజయ్, సుకుమార్ కాంబో లేనట్టేనా.. లైనప్ చూస్తే అలానే ఉంది!

హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar).. ఈ కాంబోలో సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ కాంబోలో సినిమాపై 2020 సంవత్సరంలోనే ప్రకటన వచ్చింది. రామ్ చరణ్(Ram Charan) తో రంగస్థలం(Rangasthalam తరువాత ఈ కాంబోపై చాలా వార్తలు వినిపించాయి. కానీ, సుకుమార్ మాత్రం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను మొదలుపెట్టాడు. ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆతరువాత వెంటనే పుష్ప 2ను మొదలువుపెట్టేశాడు సుక్కూ. కానీ, విజయ్ తో సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. 

ఇదే విషయం లైగర్ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండను అడగగా.. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూట్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయిన వెంటనే మా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ పూర్తికావస్తోంది కానీ, సుకుమార్ మాత్రం విజయ్ సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం.. పుష్ప 2 తరువాత సుకుమార్ మరోసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుకుమార్, విజయ్ దేవరకొండతో సినిమా చేయడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.  

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. అలా అటు సుకుమార్, ఇటు విజయ్ దేవరకొండ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు తప్పా తమ కాంబో సినిమాపై మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ కొంత కాలంగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్నాడు. కనీసం.. సుకుమార్ సినిమాతో అయినా హిట్ పడుతుంది అనుకున్నారు. కానీ, అది జరగడం లేదని బాధపడుతున్నారు. మరి ఈ కాంబోలో సినిమా వస్తుందా రాదా అనేది చూడాలి.