India Vs US: ఆయుధ వ్యాపారానికి అంగీకరించనందుకే ఇండియాని ట్రంప్ టార్గెట్ చేశాడా? అసలు నిజం ఇదే..!!

India Vs US: ఆయుధ వ్యాపారానికి అంగీకరించనందుకే ఇండియాని ట్రంప్ టార్గెట్ చేశాడా? అసలు నిజం ఇదే..!!

Trump Tariffs: రష్యాతో ఆయిల్ వ్యాపారం చేస్తున్నందుకే తాము టారిఫ్స్ విధించినట్లు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇండియా కంటే ఎక్కువ వ్యాపారం చేస్తున్న యూరోపియన్ యూనియన్, చైనాలపై త్వరలోనే టారిఫ్స్ ఉంటాయని ఇది జస్ట్ స్టార్టింగ్ అంటూ బదులిచ్చాడు ట్రంప్. అయితే దీనిని తమకు మైలేజీ తెచ్చిపెట్టే అంశంగా వాడుకుంటున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యలు చూస్తుంటే తెలుస్తోంది. ట్రంప్ రష్యన్ ఆయిల్ టారిఫ్స్ కి కారణంగా చెబుతుంటే బీజేపీ మాత్రం దేశంలోని రైతుల సంక్షేమం, ప్రయోజనాలపై రాజీపడబోమంటూ సంబంధం లేని విషయాలకు సెకండరీ టారిఫ్స్ అంశాన్ని లింక్ చేయటం కొంత ఆశ్చర్యకరంగా మారింది. 

అయితే అసలు ట్రంప్ ఇండియాపై 50 శాతం సుంకాలు తన చిరకాల మిత్రుడు పాకిస్థాన్ పై మాత్రం 19 శాతం టారిఫ్స్ ప్రకటించటం గురించే ప్రపంచ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. కొందరు నిపుణులు ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియా పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని క్రెడిట్ తీసుకోకుండా చేయటం ఆగ్రహం కలిగించిందని అందుకే టారిఫ్స్ ఎక్కువగా విధించారని అంటున్నారు. ఇదే క్రమంలో మరో ముఖ్యమైన వాదన తెరమీదకు వచ్చింది అదే ఆయుధాల వ్యాపారం.

ప్రపంచం మెుత్తానికి తెలుసు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక కన్జూమర్ బేస్ట్ వ్యవస్థ. అక్కడ అప్పులపై ఎక్కువ మంది జీవిస్తుంటారు. ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణాలను మాఫీ చేస్తుంటుంది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల నుంచి యూఎస్ కి దిగుమతులు ఎక్కువగా ఉంటుంటాయి. దాని ఎగుమతులు తక్కువగా ఉంటుంటాయి. దీని కారణంగా చాలా దేశాలతో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. దీనిని సరిచేయటానికే ట్రంప్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రధానంగా అగ్రి, డిఫెన్స్, టెక్ ఎగుమతుల ద్వారా ఈ వాణిజ్య లోటును తగ్గించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. టారిఫ్స్ ద్వారా వచ్చే డబ్బు తమకు లాభం అని అనుకుంటున్న ట్రంప్ తమ దేశ ప్రజలపై ఆ భారం పడుతుందని మాత్రం మర్చిపోతున్నారు. 

ఒత్తిడితో ఆయుధాల వ్యాపారానికి ఒప్పించటమే అసలు టార్గెట్..
భారత్ కొన్ని రోజుల కింద అమెరికా ఆఫర్ చేసిన F35 విమానాలను కొనటానికి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. దీనికి ముందు 2018లో అమెరికా తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ THAADను ఇండియాకు ఆఫర్ చేసింది. కానీ భారత్ మాత్రం దానిని తిరస్కరించి రష్యా నుంచి ఎస్400ను కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో S 400 తన పనితీరు, శక్తిని అలాగే ఖచ్చితత్వాన్ని నిరూపించుకుంది. అసలు భారత్ అమెరికాను రక్షణ రంగంలో నమ్మకపోవటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే తన స్వార్థ ఆలోచనలతో కీలక యుద్ధ సమయాల్లో అమెరికా తన ఆయుధాలు కొన్న దేశాలకు హ్యాండ్ ఇవ్వటమే. 

ALSO READ : వ్యవసాయం, పాడి పరిశ్రమపై ట్రంప్ కన్ను..

ఉదాహరణకు కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్థానుకు సాయం చేసేందుకు జీపీఎస్ వ్యవస్థను నిలిపివేసింది అమెరికా. అందుకే భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యా, ఇజ్రాయెల్ లాంటి నమ్మకమైన దేశాలతోనే భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. యుద్ధాలు పెట్టి ఆయుధాలు అమ్ముకుంటూ బతికే పెద్దన అమెరికాకు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ సహకరించకపోవటం ట్రంప్ కు మింగుడుపడటం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టారిఫ్స్ రూపంలో ఒత్తిడి చేయటం ద్వారా ఆయుధ వ్యాపారానికి భారతదేశాన్ని ఒప్పించాలనే చీకటి అజెండా అమెరికా ప్రెసిడెంట్ మనసులో ఉండొచ్చని వారు అంటున్నారు. ఆయుధాల వ్యాపారానికి అమెరికా అస్సలు నమ్మదగిన ట్రేడ్ పార్ట్నర్ కాదని యుద్ధ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.