అక్టోబర్ 27 నుంచి ఐఎస్ఏ అసెంబ్లీ

అక్టోబర్ 27 నుంచి ఐఎస్ఏ అసెంబ్లీ

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్నేషనల్​  సోలార్​ అలయన్స్​ (ఐఎస్ఏ) ఎనిమిదో అసెంబ్లీ ఈ నెల 27 నుంచి 30 వరకు  ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది.  పారిస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సీఓపీ21లో భారతదేశం ఫ్రాన్స్ కలసి ఐఎస్ఏను మొదలుపెట్టాయి. ఇందులో 124  దేశాలకు సభ్యత్వం ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా సౌర శక్తి వినియోగాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించడం, సోలార్​ ప్రాజెక్టుల కోసం కొత్త పెట్టుబడులను, ఆర్థిక వనరులను సమకూర్చడంపై ఇది ఫోకస్​ చేస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలు, విధానాల కోసం స్పష్టమైన రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌లను రూపొందిస్తారు.

ఐఎస్ఏ అసెంబ్లీ అధ్యక్షుడు, కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, మన దేశం తన పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను  ఐదేళ్లు  ముందుగానే సాధించిందని ప్రకటించారు. సుమారు 125 గిగావాట్ల సౌర సామర్థ్యంతో భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా ఎదిగిందని అన్నారు.