
దుబాయ్: టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి దూసుకొచ్చాడు. బుధవారం రిలీజ్ చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఇషాన్ (689 పాయింట్లు) ఏకంగా 68 స్థానాలు ఎగబాకి 75 నుంచి ఏడో ర్యాంక్ సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండు ఫిఫ్టీలు సహా 164 రన్స్ చేయడం అతనికి కలిసొచ్చింది. కేఎల్ రాహుల్ (627).. 14వ ర్యాంక్‌లో ఉండగా, శ్రేయస్ అయ్యర్ (617), కెప్టెన్ రోహిత్ (614) వరుసగా 16, 17వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. మాజీ కెప్టెన్ కోహ్లీ (594) 21వ ర్యాంక్‌కు పడిపోయాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్ (635) మూడు ప్లేస్‌లు మెరుగుపడి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. లెగ్ స్పిన్నర్ చహల్ (557) నాలుగు ప్లేస్‌లు ఎగబాకి 26వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. హేజిల్‌వుడ్ (792) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.