మూడో వన్డేలో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ

మూడో వన్డేలో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ

క్లీన్ స్విప్ నుంచి తప్పించుకోవాల్సిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ దంచికొట్టాడు. ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో మెరుపు సెంచరీ 101 ( 85బాల్స్ లో, 15 ఫోర్లు, 2 సిక్షర్లు ) చేశాడు. ధవన్ తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి రెండో వికెట్ పడకుండా కాపాడుతూనే, స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. కోహ్లీతో కలిసి 130 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. అయితే, 2021లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన ఇషాన్ కి ఇదే మొదటి సెంచరీ. 

గెలవక తప్పని మ్యాచ్ లోనూ టీం ఇండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ తడబడ్డాడు. ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాల్సిన ధవన్ మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 8 బంతులాడి వికెట్ పారేసుకున్నాడు. మెహిదీ హసన్ మిరాజ్ వేసిన గుడ్ లెంత్ బాల్ ను డిఫెండ్ చేయబోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముందు వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి కూడా ఆశించిన స్థాయి రన్స్ రాలేదు. బంగ్లా బౌలర్లను ఎదుర్కోడానికి కాస్త తడబడ్డా తర్వాత కుదురుకున్నాడు. ఇషాన్ కి సహకరిస్తూ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించిన కోహ్లీ 47 ( 49బాల్స్ లో) రన్స్ తో కొనసాగుతున్నాడు. హాఫ్ సెంచరీకి 3 రన్స్ దూరంలో ఉన్న కోహ్లీకి, ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు రెండు లైఫ్ లు వచ్చాయి.