ఇప్పుడు ONDC లో ఇస్కాన్ మహా ప్రసాదం..ఇలా ఆర్డర్ చేయండి

ఇప్పుడు ONDC లో ఇస్కాన్ మహా ప్రసాదం..ఇలా ఆర్డర్ చేయండి

కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో నిర్వహించే ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్ లైన్ లో కస్టమర్లు  మరిన్ని  ఉత్పత్తులను కొను గోలు చేసేందుకు అనేక చర్యలు చేపుడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియన్షి స్నెస్ (ISKCON ) నుంచి  మహా ప్రసాదం ఆర్డ ర్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. పవిత్ర సాంప్రదాయాలను ఆధునిక పద్దతిలో అందించేందుకు భారత ప్రభుత్వం సిద్దమయింది.

దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రసాదాన్ని అందించేందుకు స్వదేశీ లాజిస్టిక్ ఫ్లాట్ ఫాం షిప్రోకెట్ తో ఇస్కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నర ఇస్కాన్ దేవాలయాలలో అందించే భక్తి, పవిత్రతో మహా ప్రసాదాన్ని స్వీకరించేందుకు నిరంతరాయంగా నమ్మకంతో డెలీవరీ చేసేందుకు కృషి చేస్తుందని షిప్రోకెట్ తెలిపింది.  

ఇలా ఆర్డర్ చేయండి 

  • మహా ప్రసాద్ కోసం ఆర్డర్ర్డ చేయడానికి ONDCలో Paytm, Mystore కస్టమర్ యాప్ ను సందర్శించాలి. 
  • మీరు షాపింగ్ చేయాలనుకుంటున్న కేటగిరి ఎంచుకోవాలి 
  • ప్లాట్ ఫాం అందించి లిస్ట్ నుంచి కస్టమర్ల యాప్ ను సెలక్ట్ చేసుకోవాలి 
  • మీ ఆర్డర్ర్డ ని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయాలి 

ONDC ని  2021 డిసెంబర్ 31 న ఏర్పాటు చేశారు. ఇది డిజిటల్ కామర్స్ గా మారడానికి ఒక మోడల్ ను రూపొందించారు. ఇది భారత దేశంలోని రిటైల్ ఈ కామర్స్ వ్యాప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 2024 ఏప్రిల్ లో 7.22 మిలియన్ల లావాదేవీలను చేసింది ఈ ఫ్లాట్ ఫాం. 5లక్షల విక్రేతలను ఆన్ బోర్డు చేసింది.