
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ఒకవైపు యుద్ధం చేస్తుంటే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొడుకు యైర్ నెతన్యాహు (32) మాత్రం అమెరికాలోని మియామి బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. బీచ్ లో యైర్ జల్సాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హమాస్ టెర్రరిస్టులపై పోరాడేందుకు ఇజ్రాయెల్ సైన్యంతో పాటు అక్కడి యువకులు ‘రిజర్వ్ బలగాలు’గా రంగంలోకి దిగారు. తాము హమాస్ మిలిటెంట్లతో దేశం కోసం పోరాడుతుంటే.. యైర్ అమెరికాలో ఉండిపోవడం ఏమిటంటూ యువకులు మండిపడుతున్నారు.