ఇస్రో చీఫ్ సోమనాథ్ జీతం అంత తక్కువ.. నిజమేనా..?

ఇస్రో చీఫ్ సోమనాథ్ జీతం అంత తక్కువ.. నిజమేనా..?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..అదేనండి ఇస్రోకు చైర్మన్ అయితే జీతం ఎంత ఉంటుంది. అంతరిక్ష సంస్థకు చైర్మన్ అయితే భారీగానే ఉంటుంది. అదీ ఇస్రో లాంటి పెద్ద సంస్థకు చైర్మన్ గా నియమితులైతే..వారి శాలరీ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అని భావిస్తారు. మరి ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ ఎస్ సోమనాథ్ జీతం ఎంత ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ. 5 లక్షలు..లేదా రూ. 10 లక్షలు..లేదా అంతకంటే ఎక్కువా..? లేదా తక్కువా..?

ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతంటే..

ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ జీతం ఎంత ఉంటుందన్న చర్చ నేపథ్యంలో  ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ శాలరీపై ఆయన ట్వీట్ చేశారు. సోమ్ నాథ్ జీతాన్ని వెల్లడించారు.  ఈ క్రమంలో ఎస్ సోమ్ నాథ్..ఇస్రో ఛైర్మన్ గా నెలకు రూ. 2.5 లక్షలు మాత్రమే అందుకుంటున్నారని స్పష్టం చేశారు. 

వేతనం కంటే ముఖ్యం అదే..

ప్రతీ ఒక్కరూ తాము కోరుకున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అనుకుంటారని..ఇందుకు ఇస్రో చైర్మన్ సోమ్ నాథే నిదర్శనమని హర్ష గోయెంకా ప్రశంసించారు.  డబ్బు సంపాదన కంటే..ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న తపన ఉంది కాబట్టి..ఇవాళ సోమ్ నాథ్..ఇస్రోకు ఛైర్మన్ అయ్యారని కొనియాడారు. ఇస్రో ఛైర్మన్ కు రూ. 2.5 లక్షల జీతం ఇవ్వడం న్యాయమా కాదా అనేది పక్కన పెడితే.. సైన్స్ అండ్ రీసెర్చ్ రంగంలో ఆయనకున్న ఆసక్తిని, తపనను గుర్తించాలన్నారు.  దేశం గర్వించే ఫలితాలను సాధించడంపైననే సోమ్ నాథ్ వంటి వారి దృష్టి ఉంటుందన్నారు.  అలాంటి వ్యక్తులకు తల వంచి నమస్కరిస్తున్నా..అని హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.

ఇది చాలా తక్కువ..కానీ..

హర్ష గోయెంక ట్వీట్ ను  7.46 లక్షల మంది వీక్షించారు. వేల సంఖ్యలో లైక్స్ కొట్టారు. వందల మంది యూజర్లు కామెంట్స్ చేశారు. అయితే ఇందులో ఓ యూజర్ ..సోమ్ నాథ్ కు నెలకు రూ. 2.5 లక్షలు కాకుండా రూ. 25 లక్షలు ఇవ్వాలన్నారు. మరో యూజర్  స్పందిస్తూ..అవును జీవితంలో  డబ్బును మించిన మోటివేషన్స్ చాలా ఉంటాయి... దేశం గర్వించే పని చేయడం అత్యంత స్ఫూర్తిదాయక అంశం అని కామెంట్ చేశాడు.