ఇండియాలో ఫస్ట్ టైం.. ప్రైవేట్ లాంచ్ పాడ్‌పై ప్రైవేట్ రాకెట్ ప్రయోగం

ఇండియాలో ఫస్ట్ టైం.. ప్రైవేట్ లాంచ్ పాడ్‌పై ప్రైవేట్ రాకెట్ ప్రయోగం

అగ్నిబాన్ సార్టెడ్ 1 మిషన్ ను గురువారం ఇస్రో విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు షార్ లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి ప్రయోగించారు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. గతంలో చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో నాలుగు సార్లు ప్రయోగం వాయిదా పడింది.  5వ సారి చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ ఈ పరీక్షను సక్సెస్ చేసింది. 

భూమికి 700 కిలో మీటర్లు ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా ఈప్రయోగం  మారింది. భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగాలను ఇస్రో ప్రోత్సహిస్తుంది. ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్ ఇది.