తిరుమల శ్రీవారి పాదల చెంత చంద్రయాన్ పూజలు

తిరుమల శ్రీవారి పాదల చెంత చంద్రయాన్ పూజలు

 మరి కొన్ని గంటల్లో శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగానికి  కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ ( గురువారం) ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో ఇస్రో  బృందం స్వామి వారి సేవలో పాల్గొని, చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్-3 ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే.

లక్ష్యాలు

చంద్రయాన్-3 అనేది చంద్రయాన్-2కి అప్ డేటెడ్ మిషన్. ఇది చంద్రునిపై అంతరిక్ష నౌకను సురక్షితంగా దింపడం, చంద్రుని ఉపరితలంపై రోవర్‌ను తిరుగుతూ ఉండేలా చేసి భారతదేశం సామర్థ్యాన్ని చూపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోవర్ చంద్రుని భూగర్భంపై డేటాను సేకరించనుంది. అదనంగా, ఇది చంద్రుని పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనుంది.

సవాళ్లు

చంద్రునిపై ల్యాండింగ్ అనేది క్లిష్టమైన, సవాలుతో కూడిన పని. 2019 జూలై లో భారత్.. చంద్రునిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ -2తో చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయ్యి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రయోగిస్తోన్న చంద్రయాన్-3 ఎక్కవు ఇంధనంతో రూపొందించారు. ఇది మరింత దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అవసరమైతే ప్రత్యామ్నాయ ల్యాండింగ్ సైట్‌కు కూడా వెళ్లేట్టుగా సెట్ చేశారు.