విరాట్ కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన చంద్రయాన్ -3 సందేశం

విరాట్ కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన చంద్రయాన్ -3 సందేశం

చంద్రుడిపై పరిశోధనలకుగాను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ మాడ్యూల్ నుంచి బయటకొచ్చిన రోవర్.. చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతోంది. 

ఒకవైపు ఇలా చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా సాగుతుంటే.. మరోవైపు ఈ ప్రయోగం దెబ్బకు రికార్డులు బద్ధలవుతున్నాయి. చంద్రుడి ఉపరితలంపై 'చంద్రయాన్ -3' సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. 'నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా..' అంటూ చంద్రయాన్-3 ఇచ్చిన  సందేశాన్ని ఇస్రో మూడు రోజుల క్రితం ట్వీట్ చేసింది. ఇది దేశంలోనే అత్యధిక లైక్స్ (841.3K) వచ్చిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది.

గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ‌లో పాకిస్తాన్ పై విజయం తర్వాత విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ (796.2K) లైక్స్‌తో ఇదివరకు మొదటి స్థానంలో ఉండగా.. చంద్రయాన్ -3 ఆ రికార్డును బ్రేక్ చేసింది.

అలాగే, యూట్యూబ్‌లో ఎక్కువ మంది ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షించిన ఈవెంట్‌గా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రత్యక్ష ప్రసారాలను యూట్యూబ్‌లో 8.06 మిలియన్ల మంది వీక్షించారు. గతంలో బ్రెజిల్-  దక్షిణ కొరియా మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను 6.15 మిలియన్ల మంది వీక్షించారు.

isro tweet over Changrayaan 3 breaks virat kohli most likes record 

Changrayaan 3, Changrayaan 3 Landing, ISRO, Indian Space Reasearch organisation, Moon, Vikram Lander, Pragyan Rover, Virat Kohli, Telugu News, Latest ISRO Update, Sports News