కంప్యూటర్​ సైన్స్​ కోర్సులకు లక్షల్లో డొనేషన్లు

కంప్యూటర్​ సైన్స్​ కోర్సులకు లక్షల్లో డొనేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐటీ దాడులు రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. ప్రైవేటు విద్యాసంస్థల మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను కలవర పెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర దాడులు ఎటొచ్చి.. తమపై పడుతాయనే ఆందోళన మొదలైంది. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి, అతని బంధువుల కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో ఈ భయం మరింత పెరిగింది. రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సీట్ల దందాపై అనేక రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటాలో కంప్యూటర్​ సైన్స్ రిలేటెడ్​ కోర్సుల్లో ఒక్కో సీటుకు రూ.5లక్షల నుంచి రూ.15లక్షల దాకా డొనేషన్లు తీసుకుంటున్నారు. మెడికల్ కాలేజీల్లోనూ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా ద్వారా నిండని సీట్లను అమ్ముకుంటున్నాయి. సీటుకు రూ.20లక్షల నుంచి రూ.40లక్షల దాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

రిసిప్ట్​లు ఇవ్వని మేనేజ్​మెంట్లు

వాస్తవానికి టీఏఎఫ్ఆర్సీ ద్వారా ఆయా కాలేజీల్లో నిర్ణయించిన ఫీజు కంటే, మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు మూడింతల ఫీజు వసూలు చేస్తుంటాయి. ఇవేవీ బయటకు చెప్పరు. వీటికి అధికారికంగా రిసిప్ట్​లు ఇవ్వరు. ఇదంతా మేనేజ్​మెంట్లు గుట్టుగా సాగిస్తాయనే ఆరోపణలున్నాయి. తాజాగా మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులకు చెందిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలపై దాడుల నేపథ్యంలో అందరిలో భయం మొదలైంది. ఆ కాలేజీల్లో మేనేజ్​మెంట్లు వసూలు చేసిన డొనేషన్ల వివరాలను సేకరించినట్టు తెలిసింది. దీంతో ఆయా కాలేజీల్లో డొనేషన్ల పేరుతో భారీగా వసూలు ఫీజులు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డొనేషన్లు భారీగా వసూలు చేసిన మిగిలిన కాలేజీల్లోనూ ఆందోళన  కనిపిస్తుంది.

లెక్కలు సరి చేసుకుంటున్నరు...

రాష్ట్రంలో కాలేజీలు నడుపుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న వారితో పాటు వారి సమీప బంధువుల్లోనూ ఆందోళనలు మొదలవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికీ కాలేజీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంచాయితీ తమపై ఎక్కడ పడుతుందో అనే గుబులు వారిలో పెరిగింది. మరోపక్క ఐటీ దాడులు మరిన్ని జరుగుతాయనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం నేపథ్యంలో కొన్ని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ముందస్తు జాగ్రత్తలు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. చార్టెడ్ అకౌంటెంట్లతో లెక్కలు సరిచేసుకుంటున్నట్టు సమాచారం.