ఐటీ ఉద్యోగి రాష్ డ్రైవింగ్.. ఇద్దరు యువకులు బలి..రాయదుర్గం పరిధిలో ఘటన

ఐటీ ఉద్యోగి రాష్  డ్రైవింగ్.. ఇద్దరు యువకులు బలి..రాయదుర్గం పరిధిలో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి తన కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి, ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాడు. టోలీచౌకీకి చెందిన మహ్మద్ అబ్దుల్ నజీర్ ఫహద్ (22) పాన్ షాపులో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు మహ్మద్ అబ్దుల్ అహదుద్దీన్ ఖాన్ (25)తో కలిసి శుక్రవారం అర్ధరాత్రి స్కూటీపై టోలీచౌకీ నుంచి గచ్చిబౌలి వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో రాయదుర్గంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వీరి స్కూటీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.

 ఈ ప్రమాదంలో ఇద్దరూ గాల్లో ఎగిరిపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ను సాఫ్ట్​వేర్ ఉద్యోగి కార్తీక్​గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.