
- పొద్దున నాలుగు గంటలకే ఓపెన్
- అందుబాటులో వెరైటీ రుచులు
- సిటీలోని పలుచోట్ల సెంటర్లు
- ఇంట్రెస్ట్ చూపిస్తున్న యూత్, ఐటీ ఎంప్లాయీస్
హైదరాబాద్, వెలుగు: టిఫిన్స్‌లో ట్రెండ్, టేస్ట్ రెండూ మారాయి. చట్నీలకు బదులు నాన్‌వెజ్ వెరైటీస్ తింటున్నారు సిటిజన్స్. వేడి వేడి పాయలో ఇడ్లీని నంజుకొని తింటుంటే ఆ మజాయే వేరు. అది కూడా పొద్దున నాలుగు గంటలకే. ఇడ్లీ విత్ పాయ, ప్రాన్స్దోశ, చికెన్ విత్ పూరి.. ఇలా వెరైటీ కాంబినేష న్ లో నాన్‌వెజ్ ఐటెమ్స్‌తో టిఫిన్ సెంటర్లు ఎర్లీ మార్నింగ్ నుంచే అందుబాటులో ఉంటున్నాయి. సిటీలో నాన్‌వెజ్ టిఫిన్స్కల్చర్ మొదలై చాలా కాలమైనా.. ఫేమస్ అయ్యింది మాత్రం ఈ మధ్యేనే. నాన్‌వెజ్ టిఫిన్‌ను తినేందుకు యూత్, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
ఐటీ కారిడార్‌లో ..
ఫుడ్‌లో కొత్త వెరైటీ ఏది వచ్చినా.. ముందుగా లాంచ్అయ్యేది ఐటీ కారిడార్లోనే. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో నాన్‌వెజ్ టిఫిన్ సెంటర్స్ ఎక్కువగా వచ్చాయి. స్టూడెంట్లు ఎక్కువగా ఉండే అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, అశోక్‌నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా రన్ చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల కొన్ని నాన్‌వెజ్ టిఫిన్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు నిర్వాహకులు. మధ్యాహ్నం 12 గంటల దాకా ఒక్కో టిఫిన్ సెంటర్‌కు వందల సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారని చెబుతున్నారు.
కాంబోను బట్టి రేట్లు..
టిఫిన్ సెంటర్లలో ఇడ్లీ, వడ, పూరి, దోశ వంటి ఐటెమ్స్ ఉంటాయి. కానీ చట్నీలకు బదులు నాన్‌వెజ్ కూరలు, ఫ్రైలు లభిస్తాయి. పాయ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, ఇడ్లీ నాటుకోడి, చికెన్ కీమా దోశ, నాటుకోడి దోశ, కీమా దోశ, పాయ దోశ, ప్రాన్స్ దోశ, బోటి దోశ, పూరి విత్ పాయ, పూరి విత్ మటన్ కర్రీ, పూరి విత్ చికెన్ కర్రీ.. ఇలా డిఫరెంట్ టైప్స్కాంబోలు దొరుకుతాయి. వాటిని బట్టి రూ. 100 నుంచి రూ. 250 దాకా రేట్లు ఉన్నాయి. రేట్లు ఎక్కువ అనిపిస్తున్నప్పటికీ, నాన్‌వెజ్ క్వాంటిటీ కూడా అంతే ఉంటుందని, అలా అయితేనే గిట్టుబాటు అవుతుందని నిర్వాహ
కులు చెబుతున్నారు.
అంత పొద్దున..
ఆఫీసులో డైలీ నైట్ షిఫ్ట్ 4 గంటలకు అయిపోతుంది. అంత పొద్దున ఇంట్లో వంట చేయరు. అందుకే బయటే తినేసి ఇంటికి వెళ్తా. మూడ్‌ను బట్టి బిర్యానీ, టిఫిన్స్ తింటా. నాన్‌వెజ్ టిఫిన్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తా. అరుణ్, ఐటీ ఎంప్లాయ్, యూసఫ్‌గూడ
టేస్టీగా ఉంది
నైట్ షిప్ట్ చేసి ఇంటికి వెళ్తున్నా. రోజూ ఉదయం నార్మల్‌గా టిఫిన్ తింటా. రోజూ ఈ రోడ్ నుంచే వెళ్తా. కానీ నాన్‌వెజ్ టిఫిన్‌సెంటర్‌ను ఎప్పుడూ చూడలేదు. ఈరోజే చూశా. ఒకసారి ట్రైచేద్దామని కీమా దోశ తిన్నా. టేస్ట్ చాలా బాగుంది.
- నరేశ్ కుమార్, ప్రైవేట్ ఎంప్లాయ్
కస్టమర్స్పెరిగారు
నాలుగు నెలల నుంచి నాన్‌వెజ్ టిఫిన్ సెంటర్‌ను రన్ చేస్తున్నా. స్టార్టింగ్‌లో కస్టమర్లు తక్కువగా ఉండేవారు. మిగతా ప్లేసెస్ కంటే ఇక్కడ తక్కువ ధరకే నాన్‌వెజ్ టిఫిన్స్ఇస్తున్నాం. మౌత్ టాక్‌తో కొద్దిరోజుల్లోనే కస్టమర్లు పెరిగారు. ప్రస్తుతం బిజినెస్ బాగుంది.
-
నిర్వాహకుడు, కడప రుచులు, కూకట్పల్లి