చుండ్రు తల్లోనే ఉంటుంది అనుకుంటే పొరపాటు

చుండ్రు తల్లోనే ఉంటుంది అనుకుంటే పొరపాటు

చుండ్రు తల్లోనే ఉంటుంది అనుకుంటే పొరపాటు.. కనుబొమలకి కూడా  చుండ్రు  వస్తుంది. కెమికల్స్​తో నిండిన బ్యూటీ  ప్రొడక్ట్స్​ ఎక్కువగా వాడటం, చర్మం పొడిబారడం​, అటోపిక్, సొరియాసిస్​  లాంటి స్కిన్​ ప్రాబ్లమ్స్​ వల్ల  ఈ సమస్య వస్తుందని చెప్తోంది కాస్మొటిక్​ డెర్మటా లజిస్ట్, డెర్మటో సర్జన్​ రింకీ కపూర్​. కనుబొమల చుండ్రుని ఎలా గుర్తించాలో కూడా చెప్పిందామె. కనుబొమల చుట్టూ ఉండే చర్మం బాగా దురద పెడుతుంది. కనుబొమలు దగ్గరి చర్మం తెలుపు– పసుపు రంగులో మారి.. పొలుసులుగా అవుతుంది. ముఖంతో పాటు శరీరంలోని వివిధ భాగాల్లో  దద్దుర్లు వస్తాయి. కనుబొమలు పొలుసులుగా కనిపిస్తాయి.

చర్మం జిడ్డుగా అవుతుంది. హైపర్​ పిగ్మెంటేషన్​ సమస్య కనిపిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఉంటే డెర్మటాలజిస్ట్​ని కలిసి అవసరమైన టెస్ట్​లు చేయించుకోవాలి.కలబంద గుజ్జు, వేప , బాదం నూనె రాసి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కనుబొమలకి ఎప్పుటికప్పుడు మాయిశ్చరైజర్​రాస్తుండాలి. గాఢత తక్కువ ఉన్న స్ర్కబ్​తో వారానికోసారైనా ఐబ్రోని కడగాలి. అన్నింటికీ మించి కనుబొమలకి ఎండ తగలకుండా సన్​స్ర్కీన్​ రాసుకోవాలని చెప్తోంది రింకీ కపూర్.