వైట్ హౌస్ కు ఒక్క అడుగు దూరంలో బైడెన్

వైట్ హౌస్ కు ఒక్క అడుగు దూరంలో బైడెన్
  • ఒక్క స్టేట్ లో గెలిస్తే చాలు.. జో బైడెనే ప్రెసిడెంట్
  • బైడెన్​కు 264 ఓట్లు, ట్రంప్​కు 214 
  • మ్యాజిక్ ఫిగర్​కు 6 ఓట్ల దూరంలో బైడెన్  నెవాడా, పెన్సిల్వేనియాలో లీడ్
  • జార్జియాలోనూ స్వల్ప మెజార్టీ, రీకౌంటింగ్
  • మరో 4 స్టేట్స్​లో కొనసాగుతున్న లెక్కింపు
  • అలాస్కా, నార్త్ కరోలినాలో ట్రంప్ లీడ్ 
  • 5 స్టేట్స్​లో గెలిస్తే తప్ప ట్రంప్​కు నో చాన్స్   

 

వాషింగ్టన్అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ముగిసి మూడు రోజులవుతుండగా.. ఆఖరికి ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న కౌంటింగ్ కీలకంగా మారింది. డెమొక్రటిక్ క్యాండిడేట్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కు గెలుపు అవకాశాలు పెరగగా, ఇప్పుడున్న ప్రెసిడెంట్, రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలిచే అవకాశాలు తగ్గిపోయాయి. గురువారం వరకూ జార్జియా, పెన్సిల్వేనియా స్టేట్స్ లో భారీ లీడ్ లో ఉన్న ట్రంప్.. శుక్రవారం బాగా వెనకపడ్డడు. బైడెన్ లీడ్ లోకి దూసుకొచ్చిండు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లలో  బైడెన్ కే ఓట్లు ఎక్కువగా తేలుతుండటంతో ఆయన వైట్ హౌజ్ రేస్ లో విజయానికి దగ్గరైండు.

ఒక్క స్టేట్ లో గెలిస్తే.. బైడెనే ప్రెసిడెంట్ 

ఇండియన్ టైం ప్రకారం శుక్రవారం రాత్రి నాటికి.. బైడెన్ మ్యాజిక్ మార్క్ 270 ఎలక్టోరల్ ఓట్లకు గాను 264 ఓట్లు గెలుచుకుని.. విజయానికి 6 ఓట్ల దూరంలో ఉన్నారు. ట్రంప్ 214 ఓట్లతో వెనకపడ్డారు. బైడెన్ మొత్తంగా 7,34,86,646(50.5%)  ఓట్లు గెలుచుకోగా.. ట్రంప్​ 6,96,22,185(47.9%) ఓట్లు సాధించారు. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న నెవాడా(6), అలాస్కా(3), జార్జియా(16), నార్త్ కరోలినా(15), పెన్సిల్వేనియా(20) స్టేట్స్ ఐదింటిలో కలిపి 60 ఓట్లు ఉన్నాయి. దీంతో అలాస్కా తప్ప మిగతా ఏ ఒక్క స్టేట్​లో గెలిచినా.. బైడెన్ ప్రెసిడెంట్ అవ్వడం పక్కా అయిపోతుంది. ట్రంప్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇంకా 56 ఎలక్టోరల్ ఓట్లు గెలుపొందాల్సి ఉంది. అంటే.. ట్రంప్ అలాస్కా మినహా అన్ని రాష్ట్రాల్లో గెలవడం తప్పనిసరి అయింది.

ఓట్లు న్యాయంగా లెక్కిస్తే నేనే గెలుస్తా: ట్రంప్

‘‘డెమొక్రాట్లు ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు. రూల్స్ ప్రకారం ఇన్ టైంలో పోల్ అయిన ఓట్లను మాత్రమే కౌంట్ చేస్తే.. నేను ఈజీగా గెలుస్తా. ఇల్లీగల్ ఓట్లను కౌంట్ చేస్తే మాత్రం.. వాళ్లు మన నుంచి ఈ ఎన్నికలను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తారు..” అని ట్రంప్ గురువారం ఆరోపించారు. బ్యాలెట్ కౌంటింగ్ ప్రాసెస్​లో అన్యాయం, కరప్షన్ జరిగిందన్నారు. ఈ ఎన్నికల పోరాటం దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలోనే ముగియొచ్చని ట్రంప్ చెప్పారు.

గెలుపు నాదే: బైడెన్

‘‘ప్రస్తుతం మన పరిస్థితి చాలా బాగుంది. కౌంటింగ్ ఎప్పుడు పూర్తయినా.. నేను, కమలా హారిస్ గెలవడం పక్కా” అని బైడెన్ అన్నారు. కౌంటింగ్ పూర్తవుతుందని, అమెరికన్లంతా కామ్​గా ఉండాలని కోరారు.

కోర్టుల్లో ట్రంప్ పిటిషన్లు రిజెక్ట్.. 

మిషిగన్, జార్జియా స్టేట్స్ లో కౌంటింగ్ ఆపాలంటూ ట్రంప్ వర్గం వేసిన లా సూట్లను కోర్టులు గురువారం రిజెక్ట్ చేశాయి. పెన్సిల్వేనియాలో మాత్రం రిపబ్లికన్ ల తరఫున అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రాసెస్​ను పరిశీలించేందుకు కోర్టు అనుమతించింది. విస్కాన్సిన్​లో రీకౌంటింగ్ చేయించేందుకు కూడా ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.

బైడెన్ కు వచ్చిన ఎలక్టోరల్ ఓట్లెన్ని?

బైడెన్​కు 264 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని కొన్ని మీడి యా సంస్థలు, 253 ఓట్లే అని మరికొన్ని మీడియా సంస్థలు లైవ్ అప్డేట్స్ ఇస్తుండటంతో అయోమయం నెలకొంది. 11 ఎలక్టోరల్ ఓట్లున్న అరిజోనా రిజల్ట్ పై గందరగోళం వల్లే ఈ తేడాలు తలెత్తాయి. అరిజోనా స్టేట్​లో 90% కౌంటింగ్ పూర్తయింది. బైడెన్ 50.1%(15,32,062) ఓట్లతో లీడ్​లో ఉండగా, ట్రంప్ 48.5%(14,85,010) ఓట్లతో వెనకంజలో ఉన్నారు. దాదాపు 47 వేల ఓట్లు వెనకపడ్డారు. కౌంటింగ్ పూర్తయి, అఫీషియల్​గా ఆ స్టేట్ రిజల్ట్ ను ఇండియన్ టైం ప్రకారం శనివారం ప్రకటించే చాన్స్ ఉంది. దీంతో మిగతా కౌంటింగ్ పూర్తైనా ట్రంప్ లీడ్​లోకి వచ్చే చాన్స్ లేదనే అంచనాతో అసోసియేటెడ్ ప్రెస్, ఫాక్స్ న్యూస్ తదితర మీడియా సంస్థలు అరిజోనా స్టేట్​ను బైడెన్ గెలుచుకున్నట్లు చూపిస్తున్నయి. సీఎన్ఎన్ తదితర సంస్థలు అరిజోనాను పెండింగ్​లో పెట్టి, బైడెన్​కు 253 ఓట్లే చూపుతున్నయి.

నెవాడాలో బైడెన్ లీడ్

ఆరు ఓట్లున్న నెవాడాలో 84% కౌంటింగ్ పూర్తయింది. బైడెన్ 49.4% (6,04,251) ఓట్లతో లీడ్ లో ఉన్నారు. ట్రంప్ 48.5% (5,92,813) ఓట్లతో వెనకపడ్డారు. బైడెన్ 11,438 ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు.

అలాస్కాలో ట్రంప్ లీడ్..

మూడు ఎలక్టోరల్ ఓట్లున్న అలాస్కాలో  బైడెన్ కు 33.5%  (63,992) ఓట్లు రాగా, ట్రంప్ 62.1%  (1,18,602) ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.  ప్రస్తుతం ట్రంప్ 54,610 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.

నార్త్ కరోలినాలో ట్రంప్ లీడ్

15 ఓట్లున్న నార్త్ కరోలినాలో ట్రంప్ 50.1% (27,32,084) ఓట్లతో, బైడెన్ 48.7%(26,55,383) ఓట్లతో ఉన్నరు. ఇక్కడ ట్రంప్ ఆధిక్యం 76,701 ఉన్నారు. కౌంటింగ్ 94% పూర్తయింది.

పెన్సిల్వేనియాలో పరిస్థితి తారుమారు 

పెన్సిల్వేనియా లో బైడెన్ 49.5% (32,95,327) ఓట్లతో లీడ్​లోకి వచ్చారు. ట్రంప్ భారీ ఆధిక్యంలో ఉన్నా.. ఒక్కరోజులోనే పరిస్థితి తారుమారైంది. బైడెన్ 5,596 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నా రు. ట్రంప్ 49.4% (32,89,731) ఓట్లతో వెనకబడ్డారు. స్టేట్ లో 98% కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా ఉండటం బైడెన్​కు కలిసివచ్చే అంశం.

‘కరోనా’ స్టేట్స్​లో ట్రంప్​కు భారీగా ఓట్లు పోలైనయ్​

కరోనాను కంట్రోల్​కు తగిన ప్లాన్​ లేకపోవడం వల్ల ట్రంప్​ ఈసారి ఓడిపోతారని పలు సర్వేలు స్పష్టంచేశాయి. అయితే విచిత్రంగా కేసులు ఎక్కువున్న రాష్ట్రాల నుంచే ట్రంప్​కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 376 కౌంటీల్లో కరోనా తీవ్రంగా ఉంది.  వీటిలోని డకోటా, మోంటానా, నెబ్రాస్కా, విస్కాన్సిన్​, అయోవా వంటి ప్రాంతాల్లో ట్రంప్​కు దాదాపు 93% మెజారిటీ దక్కింది. కరోనా కంట్రోల్​లో ఉన్న అలబామా, మిస్సోరీ, మిస్సిసిపీ తదితర రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో