కంటోన్మెంట్ ​బోర్డు ఎన్నికలు వాయిదా?

కంటోన్మెంట్ ​బోర్డు ఎన్నికలు వాయిదా?

కంటోన్మెంట్, వెలుగు : కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర రక్షణ శాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల వాయిదాపై శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ నెల 4తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసింది. 28, 29 తేదీల్లో నామినేషన్లు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఒక వైపు కంటోన్మెంట్​ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్​కొనసాగుతుండగా, బోర్డు ఎన్నికల షెడ్యూల్​ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెట్​వికాస్​మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు రెండు సార్లు విచారణ చేపట్టింది.23న మరోసారి విచారించనుంది.

ఇదే టైంలో దేశంలోని కొన్ని కంటోన్మెంట్ ​బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా రక్షణ శాఖ స్పందించినట్లు తెలిసింది.