అది ప్రగతిభవన్ కాదు బానిసల నిలయం

అది ప్రగతిభవన్ కాదు బానిసల నిలయం

భూకబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ ప్రభుత్వ నుంచి బర్తరఫ్ చేయబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్‌కు తనకు ఐదేళ్ల క్రితమే మనస్పర్థలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రగతి భవన్‌లో స్వతహాగా నిర్ణయాలు తీసుకునే నాయకులు లేరని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు గోళీలు ఇవ్వడం కోసమే ఉన్న ఒక ఎంపీ ద్వారా కేసీఆర్ అపాయింట్‌‌మెంట్ తీసుకొని ప్రగతిభవన్‌కు వెళ్తే సీఎం కలవలేదని ఆయన చెప్పారు. అసలు అది ప్రగతిభవన్ కాదు.. బానిసల నిలయం అని పేరు పెట్టుకోమని ఆ గోళీలు వేసే ఎంపీకి ఆనాడే చెప్పానని ఈటల అన్నారు. ఇక్కడి వరకు వచ్చిన మమ్మల్ని లోపలికి పోనియకపోతే మీడియా మందు ఇజ్జత్ పోతదని లోపలికి వెళ్లి వస్తామన్నా కూడా లోపలికి పోనీయలేదని ఆయన తెలిపారు. ఆ రోజు నాతో మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా అవమానం పాలయ్యారని ఈటల అన్నారు. సీఎం ఆఫీసులో ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అసలు ఆయన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఒక్కరు కూడా లేరని ఆయన అన్నారు.