గ్రేటర్ హైదరాబాద్లో వర్షం.. మధ్యాహ్నం ఎండ.. రాత్రి వాన

గ్రేటర్ హైదరాబాద్లో వర్షం.. మధ్యాహ్నం ఎండ.. రాత్రి వాన

గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం పడుతోంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత కనిపించింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. ఆదివారం రాత్రి 8 నుంచి పలు చోట్ల వర్షం పడుతూనే ఉంది. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మదాపూర్, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇటు సికింద్రాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, అంబర్ పేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. 

రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ భారీగా వర్షం పడుతోంది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. 

వాతావరణశాఖ హెచ్చరిక 

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 27, 28, 29 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని చెప్పారు.