కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా మోడీ ఫోటో పెట్టలే

 కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా మోడీ ఫోటో పెట్టలే
  • మోడీ ఫోటో తప్పనిసరి.. కానీ సీఎం ఫోటో మాత్రమే పెట్టారు
  • కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేందర్ నాథ్ పాండే

మహబూబ్ నగర్: ‘‘దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది.. మోడీ ఫోటో తప్పనిసరి.. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది.. మోడీ ఫోటో పెట్టలేదు.. సుప్రీంకోర్టు సైతం మోడీ ఫోటో పెట్టుకోవాలని చెప్పింది.. కానీ కేసీఆర్ ఫోటో మాత్రమే పెట్టి మోడీ ఫోటో పెట్టకపోవడం దురదృష్టకరం’’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేందర్ నాథ్ పాండే అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి  పాత పాలమూరులోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పాండే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోందని వివరించారు. పాలమూరులో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ 23.96 శాతం పూర్తయింది, రాబోయే 6 నెలల్లో 100 శాతం పూర్తి చేస్తామని వైద్యాధికారులు చెబుతున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో మోడీ ఫోటో లేకపోవటం దురదృష్టకరం అని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ దేశ్ కి నేత కావాలని పగటి కలలు కంటున్నాడు.. అది సాధ్యం కాని పని అని కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పాండే పేర్కొన్నారు.