ఎత్తైన ప్లేస్​లో టీ పార్టీ

ఎత్తైన ప్లేస్​లో టీ పార్టీ

వాతావరణం చల్లగాఉన్నప్పుడు గరం గరం టీ తాగాలనిపిస్తుంది.  కానీ, వీళ్లు టీ పార్టీతో గిన్నిస్​ రికార్డు తెచ్చుకున్నారు. అవును... వీళ్లు టీ పార్టీ చేసుకుంది ఎక్కడో తెలుసా? ఎవరెస్ట్ పర్వతం మీద. ఎవరెస్ట్​ క్యాంప్​ 2లో...  ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్న టైమ్​లో టీ పార్టీ చేసుకున్నారు.   చలికోటు వేసుకుని, వణుకుతున్న చేతులతో టీ కప్పు పట్టుకుని ఫొటోలు కూడా దిగారు. అమెరికాకు చెందిన ఆండ్రూ హ్యూస్​ అనే అథ్లెట్​, అడ్వెంచరర్​ తన టీమ్​తో కలిసి పోయిన ఏడాది ఈ టీ పార్టీ చేసుకున్నాడు. వీళ్ల టీ పార్టీని ఎత్తైన ప్లేస్​లో జరిగిన టీ పార్టీగా ఈ మధ్యే గిన్నిస్​ వాళ్లు గుర్తించారు. ‘‘కరోనా మొదలవ్వగానే ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు. దాంతో, నాకు ఇష్టమైన పర్వాతారోహణకు బ్రేక్​ పడింది. అప్పుడే మళ్లీ మౌంటెనీరింగ్​కు వెళ్లినప్పుడు నా టీమ్​తో కలిసి టీ పార్టీ చేసుకోవాలనిపించింది. ఎత్తైన పర్వతాల  మీద, అది కూడా నేపాల్​లో టీ తాగడం మరింత స్పెషల్. అయితే, మేం టీ పార్టీకి రెడీ అవుతుండగా మంచు కురవడం మొదలైంది. చిన్న టేబుల్ మీద టీ కప్స్​ పెట్టి​, కుర్చీల్లో కూర్చొని టీ తాగాం. ఈ పార్టీ చాలా రిలీఫ్​గా అనిపించింది. వాతావరణం ఎలా ఉన్నా సరే.. ధైర్యంగా ముందు కు వెళ్లాలని ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం” అని తమ టీ పార్టీ గురించి చెప్పాడు ఆండ్రూ.