
మంథని, వెలుగు : జర్నలిస్ట్ లను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబును ప్రెస్ క్లబ్ సభ్యులు సన్మానించారు. టీయుడబ్ల్యూజే ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడిగాఎన్నికైన కొమురోజు చంద్రమోహన్, కోశాధికారి తగరం రాజు, కార్యవర్గ సభ్యులు నాగరాజును మంత్రి సన్మానించారు.