బిగ్ సీ అధినేత ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

బిగ్ సీ అధినేత ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

తెలుగు రాష్ట్రా్ల్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బిగ్ సీ మొబైల్స్ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.  విజయవాడలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో భాగంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారంలోకి పెట్టుబడులను తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటీ రిటర్స్న్ లెక్కలను అధికారులు విశ్లేషిస్తున్నారు. 

రూ.360 కోట్ల లావాదేవీలపై ఆరా..
ఏనుగు  సాంబశివరావు కుమారుడు స్వప్న కుమార్ బిగ్ సీ మొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతను హోనర్ హోమ్స్ లో భాగస్వామిగా కూడా ఉన్నారు.  హోనర్ హోమ్స్ లో రూ. 360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  గత రెండు రోజులుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరులో సైతం అధికారులు తనిఖీలు చేస్తున్నారు.