చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఐటీ దాడులు

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై  ఐటీ దాడులు

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ ఇంటితో పాటు, హైదరాబాద్ లోని సోమాజిగూడలోని నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 

మంచిర్యాలలో  వివేక్ అనుచరుల ఇళ్లలనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివేక్ ఇంటి దగ్గర మంచిర్యాల జిల్లా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.  మరోవైపు మంచిర్యాల జిల్లా పోలీసులు వివేక్ తో పాటు, కాంగ్రెస్ ముఖ్య నేతలను టార్గెట్ చేశారు. నిన్న సాయంత్రం చెన్నూరులోని కాంగ్రెస్ ముఖ్య నేతలు, వివేక్ అనుచరుల ఇండ్లలో సోదాలు చేశారు. 

ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు.  కావాలనే తమపై కుట్ర చేస్తున్నారు ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.