కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ సింగ్ ఇంట్లో సోదాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ సింగ్ ఇంట్లో సోదాలు

జార్ఖండ్ రాంచీలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ సింగ్ నివాసంలో ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుమార్ జైమంగల్ కు.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

జైమంగల్ సింగ్ ఇంట్లో సుమారు 30 నుంచి 35 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక రాంచీ, గద్దాలోని ఎమ్మెల్యే ప్రదీప్ యాదవ్ ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ ఆధీనంలోని సైన్యానికి చెందిన భూములను ఆక్రమించుకొని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో శుక్రవారం జార్ఖండ్, పశ్చిమబెంగాల్ లోని 12 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది.