
- వంశీ రామ్ బిల్డర్స్‌పై మూడో రోజూ ఐటీ సోదాలు
- బ్యాంక్‌లో డిజిటల్ లాకర్స్ ఓపెన్ చేసిన అధికారులు
- భారీగా బంగారం, నగదు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: వంశీ రామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌పై ఐటీ దాడులు మూడ్రోజులుగా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్ ఆఫీస్‌తో పాటు ఎండీ సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, ఆదాయ వ్యయాలపై మంగళవారం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎండీ సుబ్బారెడ్డి ఇంట్లో డిజిటల్ లాకర్, కుటుంబసభ్యుల పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్‌లో పెద్ద మొత్తంలో క్యాష్, గోల్డ్ సీజ్ చేసినట్లు సమాచారం.
సుమారు 220 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. గత మూడ్రోజులుగా ఏపీ, తెలంగాణలోని 30 ప్రాంతాల్లో సోదాలు చేశారు. గురువారం జరిపిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.