డైలీ ఫుడ్ లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.. ఎందుకంటే

డైలీ ఫుడ్ లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.. ఎందుకంటే

శరీరానికి అవసరమైన వాటిలో ప్రొటీన్లు ముఖ్యమైనవి. శరీరంలో కొత్త కణాలు, హార్మోన్లు తయారు కావడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి ప్రొటీన్లు చాలా అవసరం. అంతేకాదు దెబ్బతిన్న కండరాలు రిపేర్ కి కూడా ఇవి కావాలి. అందుకని ఫుడ్ లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి అంటోంది న్యూట్రిషనిస్ట్ నేహారం.

ప్రొటీన్ల కోసం బాదం తినాలి. వీటిని పచ్చిగా లేదా నానబెట్టి తినొచ్చు. సలాడ్స్ తో తిన్నా మంచిదే. రోజూ 42 గ్రాముల బాదం తింటే గుండెజబ్బుల ముప్పు తప్పుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ స్టడీ చెప్తోంది.

ALSO READ : గుండెలు పిండేసిన ఘటన : చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టిన చెల్లెలు

• చియా సీడ్స్ ప్రొటీన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తింటే ఎముకలు గట్టిపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చియా సీడ్స్ ని వంటకాలు, సాస్ లేదా పెరుగులో వేసుకొని తినొచ్చు.

• పాలు, చేపలు, సోయా గింజలు, గుడ్లు, బీన్స్, చిక్కుడు జాతి గింజల్లో ప్రొటీన్లు ఎక్కువ. అయితే, మాంసం నుంచి అందే ప్రొటీన్ల కంటే మొక్కలు, నట్స్ లో ఉన్న. ప్రొటీన్లు ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు ఇవి తొందరగా అరుగుతాయి.