పల్లెకెలెలో ఎండ వచ్చింది.. మ్యాచ్ కు లైన్ క్లియర్ చేసిన వరుణుడు

  పల్లెకెలెలో ఎండ వచ్చింది.. మ్యాచ్ కు లైన్ క్లియర్ చేసిన వరుణుడు

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానుల నిరీక్షణకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. పల్లెకెలె  ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు జరగనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా..గత రెండు రోజుల నుంచి ఈ మ్యాచ్ కి వర్షం పడే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. దీనికి తోడు నిన్న కూడా వర్షం పడటం, ఈ రోజు కూడా వర్ష సూచనలు మెండుగా ఉండడంతో పూర్తి మ్యాచ్ చూడడం దాదాపు అసాధ్యమననుకున్నారంతా. అయితే తాజా సమాచార ప్రకారం అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అందింది.  

మ్యాచ్ కి వర్షం గండం లేనట్టేనా..?

భారత్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా అని కంగారు పడిన అభిమానులకి కాస్త ఊరట కలిగించే వార్త. పల్లెకెలెలో ఈ రోజు తెల్లవారుఝామున వర్షం కుండపోతగా కురిసింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి వర్షం లేదు. వర్షం తగ్గుముఖం పట్టడంతో పాటుగా 3 గంటల తర్వాత వర్షం పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మాత్రం మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే 20 ఓవర్లు, అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ ని రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇస్తారు. మొత్తానికి మ్యాచ్ సమయానికి వరుణుడు కరుణిస్తాడో లేకపోతే ఇన్ని రోజు ఎదురు చూసిన అభిమానుల ఆశల మీద నీళ్లు చళ్ళుతుందో మరి కాసేపట్లో తెలిసిపోతుంది.
 
హాట్ ఫేవరేట్ గా పాకిస్థాన్:

 ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. గత రెండేళ్లుగా వన్డేల్లో నిలకడగా రానిస్తూ ఇటీవలే వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండడం ప్లేయర్స్ అందరూ ఫామ్ లో ఉండడం పాక్ కి కలిసి వచ్చే విషయం. మరో వైపు అనుభవంతో కూడిన భారత్ జట్టుని ఢీ కొట్టాలంటే పాక్ శక్తికి మించిన పని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి మ్యాచ్ విన్నర్లు ఎప్పటికీ ప్రమాదకరమే. అన్నిటికి మించి దుర్బేధ్యమైన భారత బౌలింగ్ ని  పాక్ ఎలా నిలువరిస్తుందో చూడాలి. మరి పాక్ ఫామ్ లో ఉన్నా.. టీమిండియా అనుభవం ముందు నిలవగలదో లేదో చూడాలి.