కమిషనర్ చెప్పి వెళ్లిన కాసేపటికే ఏరియా ఆసుపత్రిలో మళ్లీ అదే తీరు

కమిషనర్ చెప్పి వెళ్లిన కాసేపటికే  ఏరియా ఆసుపత్రిలో మళ్లీ అదే తీరు

పేషంట్స్ పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్ కుమార్ హెచ్చరించిన కాసేపటికే ఆసుపత్రిలో మళ్లీ అదే సీన్ రిపీటైంది. పేషంట్స్ ఇబ్బంది పడుతున్నారనే సమాచారంతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కమీషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్ కుమార్. అయితే అలా చెప్పిన కమీషనర్ బయటకు వెళ్లిన వెంటనే దవాఖానలో మళ్లీ అదే తీరు పునరావృతమైంది. వైద్యం కోసం వచ్చిన ఓ గర్భిణీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు టెస్టుల కోసం వెయిట్ చేసి, ఓపిక లేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది.

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గర్భిణీలు, పేషంట్స్  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో వైద్య విధాన పరిషత్ కమీషనర్ తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను పేషంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. పేషంట్స్ పై మెలాగాల్సిన విధానాన్ని  వైద్యులకు, సిబ్బందికి సూచించారు. పేదవారికి సకాలంలో అందాల్సిన వైద్యం అందించాల్సిన బాధ్యతను డాక్టర్స్ మరువద్దని తెలిపారు. గర్భిణీలకు, సామాన్య రోగులకు ఒకే క్యూ లైన్ కాకుండా వేరు వేరు ఓపీలు అందించాలని వారిని ఇబ్బంది పెట్టొద్దన్నారు. బాలింతలు రెండవ ప్లోర్ నుండి గ్రౌండ్ ప్లోర్ కు వచ్చి క్యూ లైన్ లో నిల్చొని టెస్ట్ లు చేయించుకునే పరిస్థితిపై అక్కడున్న పేషంట్స్ బంధువులు తెలపడంతో ఇక నుండి ఆ  పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆస్పత్రిలో కొనసాగుతున్న ప్రయివేట్ పెయిడ్ పార్కింగ్ కూడా తీసేస్తామన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుందని, అవి పేదలకు  అందేలా చూడాలని వైద్యులకు సూచించారు.