ఈ టీపాట్ ​ధర రూ.24 కోట్లు!

ఈ టీపాట్ ​ధర రూ.24 కోట్లు!

అపోలో లాభం 47 శాతం డౌన్‌‌

హైదరాబాద్​, వెలుగు: అపోలో హాస్పిటల్స్​ లాభం జూన్​2023 క్వార్టర్లో 47 శాతం తగ్గి రూ. 167 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది క్యూ1 లో కంపెనీ లాభం రూ. 317 కోట్లు. జూన్​2023 క్వార్టర్లో అపోలో హాస్పిటల్స్​ రెవెన్యూ మాత్రం రూ. 4,418 కోట్లకు పెరిగింది. జూన్​ 2023 చివరి నాటికి 7,798 ఆపరేటింగ్​ బెడ్స్​ను అందుకున్నామని, ఇందులో 2,380 బెడ్స్​ కెపాసిటీ కొత్తగా వచ్చి చేరిందని  రెగ్యులేటరీ ఫైలింగ్​లో అపోలో హాస్పిటల్స్​ వెల్లడించింది. ఈ కొత్త హాస్పిటల్స్ (14) లో 60 శాతం కెపాసిటీ వినియోగంలోకి వచ్చిందని, రాబోయే రోజులలో ఇవి రెండంకెల గ్రోత్​సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 

ఈ టీపాట్ ​ధర రూ.24 కోట్లు!

ఇక్కడ కనిపిస్తున్న టీపాట్​  సాదాసీదాది కాదు. ధర ఏకంగా మూడు మిలియన్​ డాలర్లు. మన కరెన్సీలో అయితే రూ.24.84 కోట్లు! వజ్రాలతో, విలువైన రాళ్లతో దీనిని తయారు చేశారు. ఇది 2016లోనే గిన్నిస్​  బుక్​లోకి ఎక్కింది. ఈ టీపాట్​పేరు ‘ది ఎగోయిస్ట్​’. దీనిని బ్రిటిష్​ ఇండియన్​ బిలియనీర్​ నిర్మల్ సేథియా స్వయంగా డిజైన్​చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు నివాళిగా ఆయన ఈ టీపాట్‌‌‌‌ను సృష్టించారు. ఎగోయిస్ట్​ను ఇటాలియన్ జ్యూయలర్​  ఫుల్వియో స్కావియా తయారు​ చేశారు.

జీవీకే పవర్​కి లాభం

హైదరాబాద్​, వెలుగు: జీవీకే పవర్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​ క్యూ1 లో ఖర్చులు తక్కువగా ఉండటంతో రూ. 275 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లో కంపెనీకి రూ. 400  కోట్ల నష్టం వచ్చింది. ఖర్చులు అంతకు ముందు ఏడాది క్యూ 1 లోని రూ. 809 కోట్ల నుంచి తాజా క్వార్టర్లో రూ. 240 కోట్లకు తగ్గినట్లు జీవీకే పవర్​ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 515 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.