చాట్ జీపీటీని బ్యాన్ చేసిన ఫస్ట్ దేశం.. వచ్చిన ముప్పు ఏంటీ.. ఎందుకు?

చాట్ జీపీటీని బ్యాన్ చేసిన ఫస్ట్ దేశం.. వచ్చిన ముప్పు ఏంటీ.. ఎందుకు?

అధునాతన టెక్నాలజీతో సంచలనంగా మారిన ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీని ఇటీలీ నిషేధించింది. దీంతో మొదటి యూరోపియన్ దేశంగా ఇటలీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది. గోప్యతా ఉల్లంఘనలపై విచారణకు ఆదేశించింది. దేశంలో తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా US స్టార్ట్-అప్ OpenAI చే అభివృద్ధి చేయబడిన మైక్రోసాఫ్ట్ సపోర్టెడ్ చాట్‌బాట్‌ను బ్యాన్ చేస్తున్నట్టు ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ స్పష్టం చేసింది. ఇది జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా ఉందా, లేదా అన్న విషయాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

చాట్‌జీపీటీ వినియోగదారుల సంభాషణలు, ఇతర చెల్లింపులపై సమాచారాన్ని ప్రభావితం చేసే డేటా ఉల్లంఘన చేసిందంటూ ఇటాలియన్ వాచ్‌డాగ్  మార్చి 20న నివేదించింది. ఇప్పటికే చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి అనేక దేశాలు నవంబర్ 2022లోనేChatGPTని బ్లాక్ చేశాయి. ఇప్పుడు ఇటలీ కూడా అదే జాబితాలోకి చేరింది. ఇటాలియన్ వినియోగదారుల డేటాను సేకరించకుండా తక్షణమే బ్లాక్ చేస్తామని ప్రకటించింది. అంతే కాకుండా చాట్‌జీపీటీ తమ వినియోగదారుల వయస్సును చెక్‌ చేయడంలో విఫలమైందని ఏజెన్సీ ఆరోపించింది.


చాట్ జీపీటీని నవంబర్ 2022లో మైక్రోసాఫ్ట్ వాడకంలోకి తీసుకొచ్చింది. 2021 వరకు ఇంటర్‌నేట్‌లో వాడిన డెటా బేస్ అధారంగా ఇది అన్నిరకాల ప్రశ్నలకు సమాధానం చెబుతోంది.