విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి : ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి :  ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా

జన్నారం, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ స్కూల్​ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రిజిస్టర్,​కిచెన్, ఆర్వో వాటర్ ప్లాంట్​ను పరిశీలించారు. క్లాస్ రూమ్​లకు వెళ్లి  విద్యార్థులతో మాట్లాడారు.

 క్లాస్ రూముల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఇన్​చార్జ్ వార్డెన్ గణేశ్ ను ప్రశ్నించారు. ఆర్వో ప్లాంట్ సైతం పని చేయకపోవడాన్ని గుర్తించి రెండు రోజుల్లో వీటిని బాగు చేయించాలని  డీటీడీవో జనార్దన్​ను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని వార్డెన్​ను  హెచ్చరించారు.